రామ్ 'రెడ్' నుంచి థ్రిల్లింగ్ అప్‌డేట్ వచ్చేసింది!
- థ్రిల్లింగ్ అప్‌డేట్ ఇస్తామని నిన్న ప్రకటన
- పోస్టర్ విడుదల చేసిన రెడ్ సినిమా యూనిట్
- సంక్రాంతికి సినిమా విడుదల
'ఇస్మార్ట్ శంకర్' అనంతరం ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ నటిస్తున్న 'రెడ్' సినిమా నుంచి దసరా సందర్భంగా థ్రిల్లింగ్ అప్‌డేట్ ఇస్తామని ఆ సినిమా యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా నుంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు తెలిపింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 9న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల ఆగిపోయింది. ఓటీటీలో విడుదల చేద్దామని భావించినప్పటికీ రామ్ తన సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. తాను నటించిన 'దేవదాస్, మస్కా' సినిమాలలాగే ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదలవుతుందని చెప్పాడు. ఈ సినిమాలో మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.