భారత్ లో 80 లక్షలకు చేరువైన కరోనా కేసుల సంఖ్య

  • గత 24 గంటల్లో 45,149 కేసుల నమోదు
  • 480 మంది మృతి
  • ప్రస్తుతం దేశంలో 6,53,717 యాక్టివ్ కేసులు
మన దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 45,149 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,09,960కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో కరోనా కారణంగా 480 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,19,014కి పెరిగింది.

ఇక 24 గంటల్లో 59,105 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6,53,717 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి 71,37,229 మంది కోలుకున్నారు. మరోవైపు, త్వరలోనే సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొందరు చెపుతున్న నేపథ్యంలో... కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం గమనార్హం.


More Telugu News