పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి బాలకృష్ణ!

  • గతంలో బాలకృష్ణతో పూరి 'పైసా వసూల్'
  • బాలయ్యను కొత్త కోణంలో చూపిన చిత్రం
  • ప్రస్తుతం బోయపాటితో చేస్తున్న బాలకృష్ణ
  • బాలయ్య కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న పూరి  
గతంలో బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కలయికలో 'పైసా వసూల్' చిత్రం వచ్చింది. అది బాక్సాఫీసు వద్ద విజయం సాధించకపోయినప్పటికీ, బాలకృష్ణను కొత్త కోణంలో ప్రెజెంట్ చేసింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ను చేస్తున్నారు. దీని తర్వాత బాలకృష్ణ చేసే చిత్రం పూరి దర్శకత్వంలోనేనని అంటున్నారు. ఇటీవల తాను ఓ స్టార్ హీరో కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నానని పూరి ప్రకటించాడు. అది బాలయ్య కోసమేనని, ఇప్పటికే బాలయ్య ఈ స్క్రిప్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ 'ఫైటర్' చిత్రాన్ని చేస్తున్నారు. దీని చివరి షెడ్యూలు షూటింగ్ త్వరలో జరుగుతుంది. దీని తర్వాత ఆయన బాలకృష్ణ చిత్రంపైనే వర్క్ చేస్తారని అంటున్నారు. సో.. వచ్చే ఏడాది వీరిద్దరి కలయికలో చిత్రం సెట్స్ కి వెళ్లచ్చు!


More Telugu News