ప్రభుత్వ అధికారులారా... పరిధి దాటి వ్యవహరించకండి: వర్ల రామయ్య

  • రాష్ట్ర ఉన్నతాధికారులనుద్దేశించి వర్ల వ్యాఖ్యలు
  • ప్రభుత్వాలు శాశ్వతం కాదని స్పష్టీకరణ
  • మీరే ప్రభుత్వాలకు శాశ్వతం అని వెల్లడి
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర ఉన్నతాధికారులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. "ప్రభుత్వ అధికారులారా... అధికార పరిధి దాటి వ్యవహరించకండి. పరిధి దాటి ప్రవర్తించిన అధికారులకు భంగపాటు తప్పదు" అని హితవు పలికారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, మీరే ప్రభుత్వాలకు శాశ్వతం అని స్పష్టం చేశారు. పరిధి దాటి గతంలో జైలు జీవితం గడిపిన పెద్ద పెద్ద అధికారులు కూడా మనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. పరిధి దాటకండి... బాధపడకండి అని సూచించారు. కొందరు అధికారుల తీరుపైనే బాధ కలుగుతోందని వర్ల రామయ్య పేర్కొన్నారు.


More Telugu News