జగన్ గారూ.. అత్యంత కుట్ర పూరితమైన ఆర్థిక నేరంలో మీరు ప్రధాన ముద్దాయి: వర్ల రామయ్య

  • కోర్టులో విచారణ మొదలైంది
  • మీరు మానసిక సంఘర్షణకు గురయ్యే అవకాశం ఉంది
  • నిర్ణయాల విషయంలో తడబడే అవకాశం ఉంది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ పై ఉన్న కేసుల విచారణను కోర్టు మొదలు పెట్టిన నేపథ్యంలో వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందించారు. అత్యంత కుట్రపూరితమైన ఆర్థిక నేరంలో జగన్ ప్రధాన ముద్దాయి అని ఆయన అన్నారు.

కోర్టులో విచారణ మొదలైందని... ఈ సమయంలో మీరు మానసిక సంఘర్షణకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. సంఘర్షణతో సంక్షేమ పథకాల నిర్ణయాల సమయంలో మీరు తడబడే ప్రమాదముందని చెప్పారు. కేసుల విచారణ పూర్తయ్యేంత వరకు మీ సీఎం పదవిని ఒక ఉపముఖ్యమంత్రికి ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని అన్నారు.


More Telugu News