టీ స్టాల్కెళ్లి చాయ్ తాగిన మంత్రి హరీశ్ రావు.. ఇక్కడ చాయ్ ఫేమసని వ్యాఖ్య.. వీడియో ఇదిగో
- ఓ సామాన్యుడిలా దుబ్బాక బస్టాండ్ సర్కిల్లో టీ తాగిన నేత
- ఇక్కడ టీ చాలా బాగుంటుందని వ్యాఖ్య
- హరీశ్ రావుతో స్థానికుల సెల్ఫీలు
దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్థానిక టీస్టాల్లో టీ తాగుతూ సందడి చేశారు. తాను చాలా సింపుల్‌గా ఉండే నాయకుడినని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. ఓ సామాన్యుడిగా దుబ్బాక బస్టాండ్ సర్కిల్లో టీ తాగుతూ అక్కడి ప్రజలతో మాట్లాడారు.
దుబ్బాకలో ఈ టీ స్టాల్ చాలా ఫేమస్ కదా? అని ఆయన టీ స్టాల్ అబ్బాయిని అడిగారు. అతడి దగ్గర టీ చాలా బాగుంటుందట అని చెప్పారు. ఓ చాయ్ పొస్తే తాగుతా అంటూ టీ తీసుకుని తాగారు. హరీశ్ రావుతో స్థానికులు సెల్ఫీలు తీసుకున్నారు. వారిని హరీశ్ రావు ఆప్యాయంగా పలకరించారు.
కాగా, ఈ నెల 3న జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్థానంలో ఆయన భార్య సుజాత పోటీకి దిగారు. ఆ స్థానంలో టీఆర్ఎస్ గెలుపు బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు టీఆర్ఎస్ అప్పగించింది.