బ్యాగులు సర్దుకునే టైమొచ్చింది ట్రంప్... ఇక ఇంటికి దయచేయ్!: జో బైడెన్

  • మరికొన్ని గంటల్లో యూఎస్ పోలింగ్ మొదలు
  • ప్రచారంలో చివరిరోజున ట్రంప్ పై బైడెన్ నిప్పులు
  • ట్రంప్ పాలనలో కష్టాలు, వైఫల్యాలేనని విమర్శలు
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభంకానున్న వేళ, చివరి ప్రచారంలో భాగంగా, తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన జో బైడెన్, ట్రంప్ కు ఓటమి తప్పదని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో పడ్డ కష్టాలు ఇక చాలునని వ్యాఖ్యానించిన ఆయన, "ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, తన బ్యాగులు సర్దుకుని, వైట్ హౌస్ ను వీడి ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది" అని అన్నారు. 

ఓహియోలో తన చివరి ప్రచార దినాన్ని గడిపిన బైడెన్, ట్రంప్ పాలనలో కష్టాలు, ట్వీట్లు, కోపాలు, విద్వేషం, వైఫల్యం, బాధ్యతారాహిత్యం తదితర ఎన్నో కనిపించాయని వ్యాఖ్యానించారు. ఇకపై వాటిని దూరం చేసుకుని అభివృద్ధి దిశగా అమెరికా ముందుకు సాగాల్సివుందని అన్నారు. తనను ఎన్నుకుంటే, కరోనా మహమ్మారిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకుని వస్తానని బైడెన్ మరోమారు హామీ ఇచ్చారు.


More Telugu News