పవన్ కల్యాణ్ సినిమాలో మరో హీరో ఎవరో?
- వరుస సినిమాలు చేస్తున్న పవన్ కల్యాణ్
- సాగర్ చంద్రతో 'అయ్యప్పనుమ్ కోషియమ్'
- మరో హీరో పాత్ర కూడా ఇందులో కీలకం
- తాజాగా విజయ్ సేతుపతి పేరు తెరపైకి
ఆమధ్య రాజకీయాలలో బిజీ అయి, కొన్నాళ్లు సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల మళ్లీ సినిమాలలో నటిస్తున్న సంగతి విదితమే. పైగా ఇప్పుడు వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అంగీకరించిన చిత్రమే 'అయ్యప్పనుమ్ కోషియమ్'. మలయాళంలో హిట్టయిన ఈ చిత్రకథ నచ్చడంతో పవన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇందులో పవన్ పాత్ర కాకుండా మరో హీరో పాత్ర కూడా వుంది. కీలకమైన ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదటి నుంచీ రానా దగ్గుబాటి ఈ పాత్రను పోషిస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ, తాజాగా మరికొన్ని పేర్లు ఆ జాబితాలో చేరుతున్నాయి.
నితిన్ నటిస్తాడని ఒకసారి.. కాదు కన్నడ నటుడు సుదీప్ నటిస్తాడని మరోసారి కూడా వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇదిలావుంచితే, ఇందులో పవన్ సరసన కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇది కూడా అధికారికంగా ఖరారు కావలసి వుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించే ఈ సినిమాలో పవన్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రను పోషించనున్నారు.