సినిమాను వర్మ అసభ్యకరంగా తీశారు... సుప్రీంకోర్టుకు కూడా వెళతాం: దిశ తండ్రి
- దిశ కథాంశంతో సినిమాను తెరకెక్కించిన వర్మ
- విడుదలకు సిద్ధంగా ఉన్న 'దిశ ఎన్ కౌంటర్'
- సినిమాను ఆపేయాలని కోరుతున్న దిశ తండ్రి
వివాదాస్పద అంశాలు, సంచలన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించడంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందు వరుసలో ఉంటారు. తాజాగా 'దిశ ఎన్ కౌంటర్' అనే చిత్రాన్ని ఆయన రూపొందించారు. హైదరాబాద్ నగర శివార్లలో హైవే పక్కన నలుగురు ముష్కరులు హత్యాచారం చేసిన ఘటన ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అయితే, ఈ చిత్రంపై దిశ తండ్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అసభ్యకరంగా ఈ చిత్రాన్ని రూపొందించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూట్యూబ్ లో విడుదల చేసిన ట్రైలర్ ను కూడా నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమాను అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు వరకు కూడా వెళతామని ఆయన అన్నారు. ఒకవేళ సినిమాను విడుదల చేస్తే పరువు నష్టం దావా కూడా వేస్తానని చెప్పారు. మరోవైపు సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా...ఈ అంశంపై రామ్ గోపాల్ వర్మ ఇంత వరకు స్పందించలేదు.