పెళ్లి వేడుకలో సామాన్యుడిలా సినీ హీరో సూర్య.. ఫొటో వైరల్!

  • సామాన్యుడిలా పనులు చేసిన హీరో
  • దర్శకురాలు సుధ కొంగర కూతురి పెళ్లికి హాజరు
  • పెళ్లి కూతురుకు పట్టే పందిరిని పట్టుకున్న సూర్య
సినీ హీరో సూర్య చాలా సందర్భాల్లో సామాన్యుడిలా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటారు. తాజాగా ఆయన దర్శకురాలు సుధ కొంగర కూతురి పెళ్లికి హాజరై మరోసారి తన సింప్లిసిటీని ప్రదర్శించారు. పెళ్లి వేడుకలో భాగంగా పెళ్లి కూతురుకు పట్టే పందిరిని పట్టుకుని ఆయన రావడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కూడా ఈ ఫొటోలో ఉన్నాడు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సూర్య సామాన్యుడిలా కనపడడం చూసి అభిమానులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. సుధ కొంగర దర్శకత్వంలో  సూర్య ‘సూరారై పోట్రూ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది.


More Telugu News