ఎట్టి పరిస్థితుల్లో అంబులెన్స్ ఆగకూడదని నిశ్చయించుకున్నా: ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీ
- ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ కు దారిచూపిన బాబ్జీ
- ట్రాఫిక్ కానిస్టేబుల్ చర్యకు సర్వత్రా ప్రశంసలు
- అది తన బాధ్యత అంటూ వినమ్రంగా పేర్కొన్న బాబ్జీ
ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్ కు తాను ముందు పరిగెడుతూ మార్గాన్ని క్లియర్ చేసి దారి చూపిన అబిడ్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీ సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన అతడి స్ఫూర్తిని అందరూ కొనియాడుతున్నారు. దీనిపై ట్రాఫిక్ పోలీసు బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ అంబులెన్స్ నిలిచిపోకూడదని నిశ్చయించుకున్నానని వెల్లడించారు.
ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ఏదైనా అంబులెన్స్ వస్తే, ఆ అంబులెన్స్ కు అడ్డంకుల్లేకుండా చేయాలని ఎప్పుడూ అనుకునేవాడ్నని తెలిపారు. ఆ రోజు అంబులెన్స్ మొజాంజాహీ మార్కెట్ సమీపానికి వచ్చిన సమయంలో ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉందని, ఎవరి సాయం లేకుండా అంబులెన్స్ ముందుకు వెళ్లలేదని భావించి, తాను ముందు పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేశానని వివరించారు. అంబులెన్స్ లో ఉన్నవాళ్ల ప్రాణం కాపాడడం అనే అంశమొక్కటే ఆ సమయంలో తన మదిలో ఉందని బాబ్జీ స్పష్టం చేశారు.
ఏదేమైనా అది తన కర్తవ్యం అని, అంబులెన్స్ లోని వ్యక్తి బతికి బయటపడ్డాడని సంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఉన్నతాధికారులు కూడా అభినందించారని, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. మొత్తానికి తన చర్యతో బాబ్జీ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడనడంలో సందేహంలేదు.