నేడు, రేపు భారీ వర్షాలకు అవకాశం!
- ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- శ్రీలంక సమీపంలో మరో ఆవర్తనం
- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనానికి తోడుగా, శ్రీలంక తీరానికి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతంలో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు మరో ఆవర్తనం వ్యాపించి వుందని తెలిపారు. దీని ప్రభావం తమిళనాడు, కేరళ, కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాలపై ఉంటుందని, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.