శ్రీహరికోటలో భారీ వర్షం... ఆలస్యంగా నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ-49

  • నేడు పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం
  • కొన్ని నిమిషాల పాటు ప్రయోగం వాయిదా
  • 3.12 గంటలకు ప్రయోగం
ఈ మధ్యాహ్నం 3.02 గంటలకు నింగిలోకి దూసుకెళ్లాల్సిన పీఎస్ఎల్వీ సీ-49 కొన్ని నిమిషాల ఆలస్యంగా ఎట్టకేలకు నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం జరుగుతున్న శ్రీహరికోటలో భారీ వర్షం పడుతుండడమే అందుకు కారణం. ఈ ప్రయోగం 10 నిమిషాలు ఆలస్యం అయింది. పరిస్థితులు అనుకూలించడంతో రాకెట్ ను 3.12 గంటలకు ప్రయోగించారు. ఈ మేరకు మిషన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ద్వారా ఈఓఎస్-01 ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.


More Telugu News