కమలా హారిస్ విజయంపై ఏపీ సీఎం జగన్ స్పందన!

  • డెమోక్రాట్లయినా, రిపబ్లికన్లయినా సరే..
  • రాజకీయాల సంగతి పక్కన పెడదాం
  • భారత మూలాలున్న కమల విజయం సాధించడం గర్వంగా ఉంది
  • ఆమెను దేవుడు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను
అమెరికా ఎన్నిక‌ల్లో ఉపాధ్య‌క్ష అభ్య‌ర్థి క‌మ‌లాహారిస్ విజయం సాధించడంతో ఆమెకు భారతీయ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. డెమోక్రాట్లయినా, రిపబ్లికన్లయినా సరే, రాజకీయాల సంగతి పక్కన పెడితే, భారత మూలాలున్న కమలాహారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు గర్వంగా ఉందని జగన్ ట్వీట్ చేశారు.

దేవుడు ఆమెను ఆశీర్వదించటంతో పాటు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నానని జగన్ చెప్పారు. కాగా, కమలాహారిస్‌ ఇంతకుముందు  శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె తల్లి స్వస్థలం తమిళనాడు కావడంతో భారతీయులు కమలాహారిస్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News