సానుకూల ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో.. ఇంట్లో పుట్టినరోజును జరుపుకున్న తేజశ్వి యాదవ్!
- నేడు 31వ పుట్టినరోజును జరుపుకున్న తేజశ్వి
- కుటుంబసభ్యుల మధ్య ఘనంగా చేసుకున్న తేజశ్వి
- కేక్ కట్ చేసి తల్లికి తినిపించిన తేజశ్వి
రేపు బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ గెలవబోతున్నాడే చెపుతున్నాయి. మహా కూటమి అభ్యర్థిగా ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టబోతున్నాననే ధీమాతో ఉన్న తేజశ్వి ఈరోజు తన 31వ పుట్టినరోజును జరుపుకున్నారు.
తన కుటుంబసభ్యుల మధ్య వేడుకను ఘనంగా చేసుకున్నారు. తల్లి రబ్రీదేవి, సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో పాటు సోదరీమణులు, బావల మధ్య కేక్ కట్ చేసి ఆనందంగా గడిపారు. జన్మదినం సందర్భంగా ఇంటిని రంగురంగుల దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. కేక్ ను కట్ చేసిన తేజశ్వి తొలుత తన తల్లికి తినిపించారు. అనంతరం తన కుమారుడికి రబ్రీదేవి కేక్ పెట్టింది. మరోవైపు పలువురు రాజకీయ ప్రముఖులు తేజశ్వికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.