తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ హైకోర్టును ఆశ్రయించిన రఘునందన్ రావు

  • దుబ్బాకలో ఘనవిజయం సాధించిన రఘునందన్ రావు
  • తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపణ
  • ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్
దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో  విజయం సాధించడం ద్వారా రఘునందన్ రావు సంచలనం సృష్టించారు. తాజాగా ఈ బీజేపీ ఎమ్మెల్యే పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపై హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆయన కోర్టుకు తెలిపారు.

ఎన్నికల వేళ తన బంధువుల నివాసాల్లో రూ.18 లక్షలు దొరికాయని, అవి తనవేనంటూ కట్టుకథలు అల్లారని ఆరోపించారు. ఈ అంశంలో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఆ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ రఘునందన్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

కాగా, ఈ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు చేరింది. అయితే, ప్రజాప్రతినిధులపై కేసులను చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుందని, అందుకే ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ కు బదిలీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.


More Telugu News