చిరు లేకుండానే పునఃప్రారంభమైన 'ఆచార్య' షూటింగ్
- సెట్స్ పైకి వెళ్లిన ఆచార్య టీమ్
- చిరుకు కరోనా పాజిటివ్
- ఇతర నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్న కొరటాల శివ
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సందేశాత్మక చిత్రంలో చిరు పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత నిలిచిపోయిన 'ఆచార్య' షూటింగ్ మళ్లీ పునరుద్ధరించారు. అయితే చిరంజీవి లేకుండానే షూటింగ్ ఇవాళ పునఃప్రారంభమైంది. చిరంజీవి కరోనాతో బాధపడుతుండడంతో, ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రబృందం షూటింగ్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
చిరంజీవి కరోనా బారినపడ్డారని తెలియగానే, 'ఆచార్య' ప్రోగ్రెస్ పై ఆందోళన వ్యక్తమైంది. అయితే చిరు విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఇతర నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించి, సినిమాను షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.