రాజధానికి సింహాచలం భూములను వాడాలని చూస్తున్నారు: సోము వీర్రాజు

  • టీటీడీ కల్యాణమండపం కూడా సరిగా లేదు
  • టీటీడీ ధర్మ రక్షణకు రూ. 500 కోట్లు ఇవ్వాలి
  • పోర్న్ వీడియోలు చూసిన ఎస్వీబీసీ ఉద్యోగులను తొలగించాలి
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. సింహాచలం దేవస్థానం భూములను రాజధానికి వాడాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని అన్నారు. టీటీడీ కల్యాణమండపం కూడా సరిగా లేదని చెప్పారు. టీటీడీ ధర్మ రక్షణకు రూ. 500 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ లో ఉద్యోగులు పోర్న్ వీడియోలు చూడటం దారుణమని అన్నారు. ఇలాంటి పనులకు పాల్పడిన వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎస్వీబీసీ ఛానల్ ను ధర్మచార్యులకు అప్పగించాలని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులో ధర్మచార్యులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.


More Telugu News