అమిత్ షా ట్విట్టర్ ఖాతా నుంచి కాసేపు మాయమైన ప్రొఫైల్ ఫొటో
- కాపీరైట్ ఫిర్యాదుతో ఫొటోను తొలగించిన ట్విట్టర్
- ఆ తర్వాత కాసేపటికే పునరుద్ధరణ
- గ్లోబల్ కాపీరైట్ పాలసీ ప్రకారం ఖాతాను కాసేపు లాక్ చేసిన వైనం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ డిస్‌ప్లే ఫొటోను ట్విట్టర్ తొలగించింది. ఓ కాపీరైట్ హోల్డర్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఫొటోను తొలగించినట్టు మైక్రోబ్లాగింగ్ సైట్ వివరణ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే ఫొటోను పునరుద్ధరించింది. అమిత్ షా ఫొటోపై క్లిక్ చేస్తే బ్లాంక్ పేజ్ కనిపించింది. దాంట్లో ‘కాపీరైట్ హక్కుదారుడి ఫిర్యాదుతో ఫొటోను తొలగించినట్టు ఓ సందేశం కనిపించింది.
గ్లోబల్ కాపీరైట్ పాలసీ ప్రకారం అమిత్ షా ఖాతాను తాత్కాలికంగా లాక్ చేసినట్టు ట్విట్టర్ తెలిపింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే ఖాతాను పూర్తిగా పునరుద్ధరించినట్టు ట్విట్టర్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ట్విట్టర్ కాపీరైట్ పాలసీ ప్రకారం.. ఫొటోగ్రాఫ్‌లో ఏముందన్నది కాకుండా ఆ ఫొటోను తీసిన వ్యక్తే దాని హక్కుదారుడు అవుతాడని ట్విట్టర్ వివరించింది. కాగా, ఇలాంటి కాపీరైట్ ఉల్లంఘన కారణంగా బీసీసీఐ డిస్‌ప్లే ఫొటోను ఇటీవల ట్విట్టర్ తొలగించింది.