సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నామినేటెడ్ ఎమ్మెల్సీలు

  • గోరటి, బస్వరాజు, దయానంద్ లకు ఎమ్మెల్సీ చాన్స్
  • తెలంగాణ కేబినెట్ నిర్ణయం
  • సీఎం ఆశీస్సులు అందుకున్న ముగ్గురు ఎమ్మెల్సీలు
తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను రాష్ట్ర కేబినెట్ ఈ సాయంత్రం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, భోగారపు దయానంద్ లకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అవకాశం పొందిన ఆ ముగ్గురు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. తమను మండలికి పంపాలన్న నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గోరటి తదితరులను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా శాలువాలు కప్పి అభినందించారు. ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్న నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలిపారు.


More Telugu News