ట్రంప్ మద్దతుదారులతో నిండిపోయిన వైట్‌హౌస్ పరిసరాలు.. భారీ ర్యాలీ

  • డెమొక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
  • మిలియన్ మాగా మార్చ్ నిర్వహించిన మద్దతుదారులు
  • అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందని మరోమారు ఆరోపించిన ట్రంప్

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలైనప్పటికీ ఆయన మద్దతుదారుల జోరు ఏమాత్రం తగ్గలేదు. వాషింగ్టన్ డీసీలో నిన్న ఆయన మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించి డెమొక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మిలియన్ మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్)  మార్చ్ నిర్వహించారు.  ‘ట్రంప్ 2020: కీప్ అమెరికా గ్రేట్’, ‘ట్రంప్ గొప్ప అధ్యక్షుడు’, ‘స్టాప్ ది స్టీల్’ వంటి నినాదాలతో హోరెత్తించారు. ట్రంప్ మద్దతుదారులతో వైట్‌హౌస్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న ట్రంప్ నిన్న కూడా మరోమారు అవే ఆరోపణలు చేశారు.





More Telugu News