తండ్రికి గుడికట్టి పూజిస్తున్న విశాఖ కానిస్టేబుల్

  • ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దాసు
  • గుండెపోటుతో మరణించిన దాసు తండ్రి
  • నిత్యం పూజలతో తండ్రిని స్మరించుకుంటున్న దాసు
మానవ సంబంధాలు గడ్డుకాలం ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో కన్నతండ్రికి గుడికట్టి పూజిస్తున్న ఓ యువకుడు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాడు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీకి చెందిన వాసుపల్లి దాసు ఏపీ ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. దాసు తండ్రి వాసుపల్లి దేముడు గుండెపోటు కారణంగా మరణించారు.

తండ్రిని అపారంగా ప్రేమించే దాసు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఓ గుడి నిర్మించి అందులో తండ్రి విగ్రహం ప్రతిష్టించాడు. ప్రతిరోజూ అందులో పూజలు చేస్తూ పితృభక్తి చాటుకుంటున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న పండుటాకులను ఆశ్రమాల పాలుచేస్తున్న సంతానం ఉన్న ఈ రోజుల్లో తండ్రికి ఆలయం కట్టి పూజలు చేస్తున్న దాసు నిజంగా ప్రత్యేకమైన వ్యక్తి.


More Telugu News