నంద్యాల ఆత్మహత్యల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేత పట్టాభి
- కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం
- ఇద్దరు పోలీసులు అరెస్ట్
- చీకటిపడ్డాక పోస్టుమార్టం చేశారన్న పట్టాభి
- ఒక్కో గోతిలో రెండేసి మృతదేహాలను పడేశారని ఆరోపణ
- ముస్లిం సంప్రదాయాలకు వ్యతిరేకమని వ్యాఖ్యలు
నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం అనే ఆటోడ్రైవర్ కుటుంబం ఇటీవల సామూహిక ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ కలచివేసింది. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ లను ఈ కేసులో నిందితులుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ ఆత్మహత్యల వ్యవహారంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అంటున్నారు.
సాయంత్రం 5 గంటల తర్వాత పోస్టుమార్టం చేసేందుకు నిబంధనలు అంగీకరించవని, కానీ అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల మృతదేహాలకు నంద్యాల ఆసుపత్రిలో సాయంత్రం 6 గంటల తర్వాత పోస్టుమార్టం చేశారని ఆరోపించారు. రాత్రివేళ పోస్టుమార్టం నిర్వహించే అనుమతి లేకపోయినా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ఎలా చేశారు? ఎవరి ఒత్తిడితో చేశారు? అని ప్రశ్నించారు.
అది కూడా సరైన లైటింగ్ ఏర్పాట్లు లేకుండానే నామమాత్రంగా పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారని, ఆ తర్వాత కూడా హడావుడిగా ఖననం నిర్వహించారని తెలిపారు. అర్ధరాత్రి వేళ ముస్లిం సంప్రదాయాలకు వ్యతిరేకంగా అంత్యక్రియలు జరిగాయని అన్నారు. ఒక్కోగోతిలో రెండు మృతదేహాలను వేయడం ఏంటని నిలదీశారు. అసలు, ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ నివేదిక, విట్నెస్ సర్టిఫికెట్లు కూడా తేడాగా ఉన్నాయని పట్టాభి అభిప్రాయయపడ్డారు.