ఏడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్

  • డిప్యూటీ సీఎంలుగా కిషోర్ ప్రసాద్, రేణుదేవి ప్రమాణం
  • నితీశ్ తో పాటు 14 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం
  • కార్యక్రమానికి హాజరైన అమిత్ షా
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఏడో సారి ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. బీహార్ గవర్నర్ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఇదే సమయంలో బీజేపీకి చెందిన తార్ కిషోర్ ప్రసాద్, రేణుదేవిలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. నితీశ్ తో పాటు మరో 14 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రతిపక్ష ఆర్జేడీ పార్టీ నేతలెవరూ హాజరుకాలేదు. మరోవైపు సీఎంగా మరోసారి బాధ్యతలను స్వీకరించిన నితీశ్ కుమార్ కు దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.


More Telugu News