పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశం

  • నాదెండ్ల మనోహర్ నివాసంలో కీలక భేటీ
  • గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత
  • నిన్న పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసిన బండి సంజయ్, జనసేన
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఈ మధ్యాహ్నం  జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.

ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన... బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపుతుండగా, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మాత్రం తమకు ఎవరితోనూ పొత్తు లేదని నిన్న స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్, బండి సంజయ్ చర్చలు జరుపుతారని జనసేన పార్టీ ప్రకటన చేయడంతో పొత్తు విషయంలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News