శ్రీను వైట్ల, మంచు విష్ణు చిత్రం ప్రకటన.. టైటిల్ 'డి&డి'!
- 13 ఏళ్ల తర్వాత 'ఢీ' చిత్రానికి సీక్వెల్
- ట్యాగ్ లైన్ గా 'డబుల్ డోస్'
- విష్ణు జన్మదినం సందర్భంగా ప్రకటన
మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్లో చాలా కాలం తర్వాత ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. 'ఢీ' చిత్రానికి సీక్వెల్ గా రూపొందే ఈ సినిమాకి 'డి&డి' అనే వెరైటీ టైటిల్ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఈ రోజు చిత్రనిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనికి 'డబుల్ డోస్' అనేది ట్యాగ్ లైన్ గా నిర్ణయించారు. విష్ణు జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు టైటిల్ లోగోతో ఈ ప్రకటన చేశారు.
సుమారు పదమూడేళ్ల క్రితం విష్ణు, శ్రీను వైట్ల కలయికలో 'ఢీ' సినిమా వచ్చింది. ఇది మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను అలరించి, బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగా రెండు రోజుల క్రితం విష్ణు కూడా ఈ రోజు ప్రత్యేక ప్రకటన ఉంటుందంటూ హింట్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ రోజు ఈ సినిమా టైటిల్ లోగోతో కూడిన ప్రకటనని విడుదల చేశారు.