తెలంగాణలో దాడులు.. ఏపీలో శిరోముండనాలు.. కేసీఆర్, జగన్‌లపై విరుచుకుపడిన బాబూమోహన్
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాబూమోహన్
- ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన పాలన
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీదే విజయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులపై ప్రముఖ సినీనటుడు, బీజేపీ నేత బాబూమోహన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండు రాష్ట్రాల్లోనూ స్వార్థపూరిత, కుటుంబ పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా నిన్న తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకే రకంగా పరిపాలిస్తున్నారని, పేద, బడుగు, బలహీన వర్గాలను గాలికి వదిలేశారని అన్నారు. తెలంగాణలో దళితులను పోలీస్ స్టేషన్‌లో పెట్టి కొట్టిస్తుంటే, ఏపీలో శిరోముండనం చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో మోదీ ప్రభంజనం మొదలైందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు.