తొలి రెండు టెస్టులకు దూరం కానున్న రోహిత్ శర్మ, ఇశాంత్ శర్మ

  • గాయాల బారిన పడిన రోహిత్, ఇశాంత్
  • జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న వైనం
  • ఫిట్ నెస్ సాధించడానికి కొన్ని వారాల సమయం పట్టే అవకాశం
ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మలు దూరంకానున్నారు. ఆ తర్వాత జరిగే రెండు టెస్టులకు కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నాలుగు టెస్టుల సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కాబోతోంది. గాయాల బారిన పడిన రోహిత్, ఇశాంత్ లు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారు.

వీరిద్దరూ పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి కొన్ని వారాల సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుందని వెల్లడించాయి. ఇప్పటికిప్పుడు ఆస్ట్రేలియాకు బయల్దేరినా అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని... కనీసం ప్రాక్టీస్ చేయడానికి కూడా అవకాశం ఉండదని వెల్లడించాయి. ఒకవేళ క్వారంటైన్ సమయంలో ప్రాక్టీస్ చేయాలంటే అక్కడి ప్రభుత్వంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాట్లాడి ఒప్పించాల్సి ఉంటుందని చెప్పారు.


More Telugu News