అబద్ధాలను ప్రచారం చేయడంలో తండ్రీకొడుకులు పోటీపడుతున్నారు: కిషన్ రెడ్డి

  • నగర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
  • విద్యార్థులు, యువత, మహిళలే జీజేపీకి బలం
  • ఇంటి నిర్మాణాలకు మేం అధిక ప్రాధాన్యతను ఇస్తాం
హైదరాబాద్ నగర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లినా బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీజేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారని కిషన్ రెడ్డి అన్నారు. విద్యార్థులు, యువత, మహిళలే బలమని చెప్పారు. బండి సంజయ్, లక్ష్మణ్ లతో కలిసి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దుబ్బాక ఉప ఎన్నికలో కూడా యువత ప్రధాన పాత్రను పోషించిందని కిషన్ రెడ్డి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా వారు ప్రధాన పాత్రను పోషిస్తారని అన్నారు. దేశంలో ఉన్న 80 శాతం కార్పొరేషన్లు బీజేపీ చేతిలోనే ఉన్నాయని చెప్పారు. నగరంలో ఇంటి నిర్మాణాలకు తాము అధిక ప్రాధాన్యతను ఇస్తామని అన్నారు. తమ మేనిఫెస్టోలో ఈ వివరాలన్నీ ఉంటాయని తెలిపారు. తండ్రీకొడుకులు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


More Telugu News