గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన సీఎం జగన్... ఫొటోలు ఇవిగో!
- నేడు గురునానక్ జయంతి
- విజయవాడ గురుద్వారాకు విచ్చేసిన సీఎం జగన్
- సీఎంకు ఘనస్వాగతం
సిక్కు మతగురువు గురునానక్ 551వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ విజయవాడలోని గురుద్వారాకు విచ్చేశారు. అక్కడ నిర్వహించిన గురుపూరబ్ ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకుముందు, గురుద్వారాకు విచ్చేసిన సీఎంకు శ్రీ గురుసింగ్ సహధర్మ ప్రచార్ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రార్థనల అనంతరం గురుద్వారా వివరాలను సిక్కు మతపెద్దలు సీఎంకు వివరించారు. పలు జ్ఞాపికలను ఆయనకు బహూకరించారు. గురునానక్ కాలనీలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని తదితరులు కూడా పాల్గొన్నారు.