సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రకుల్ నటిస్తున్న మూడు సినిమాలు ఓటీటీకి
- పూణేలో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' షూటింగ్
- బాలకృష్ణ సినిమాలో నెగటివ్ పాత్రలో యంగ్ హీరో
* కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న మూడు సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని, నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తోంది. అలాగే అర్జున్ కపూర్ హీరోగా హిందీలో ఓ చిత్రాన్ని చేస్తోంది. ఈ మూడు చిత్రాలూ కూడా ఓటీటీ ద్వారా విడుదలవుతాయని అంటున్నారు.
* ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగును పూణేలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రధాన తారాగణం అంతా ఈ షూటింగులో పాల్గొంటారు.
* బాలకృష్ణ బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడో చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఇందులో యంగ్ హీరో నవీన్ చంద్రను ఓ ముఖ్య పాత్రకు తీసుకుంటున్నారు. ఈ పాత్ర నెగటివ్ షేడ్స్ తో సాగుతుందట.