దివ్యాంగులు తాము ఎవరికీ తక్కువ కాదని చాటుతున్నారు... ప్రాంజల పాటిల్ అందుకు ఉదాహరణ: చంద్రబాబు
- ఇవాళ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
- చంద్రబాబు శుభాకాంక్షలు
- దివ్యాంగులకు అందరూ అండగా నిలవాలని పిలుపు
నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు దివ్యాంగులు కూడా అవకాశాలను అందిపుచ్చుకుని పలు రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. లక్ష్యాన్ని సాధించడంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో తాము ఎవరికీ తక్కువ కాదని చాటుతున్నారని ప్రశంసించారు. దేశచరిత్రలో ఈ విధంగా తొలిసారి ఐఏఎస్ కు ఎంపికైన అంధ మహిళ ప్రాంజల పాటిల్ అందుకు ఓ ఉదాహరణ అని వెల్లడించారు.
దివ్యాంగులు ఇతరులతో సమానంగా జీవించే హక్కును, భద్రతను, గౌరవాన్ని అందుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లేలా అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని, అందుకు ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతినబూనుదాం అని పిలుపునిచ్చారు.