మూడో టీ20: రాణించిన వేడ్, మ్యాక్స్ వెల్... టీమిండియా టార్గెట్ 187 రన్స్

  • సిడ్నీలో టీ20 మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా
  • కెప్టెన్ ఫించ్ డకౌట్
  • 53 బంతుల్లో 80 పరుగులు చేసిన ఓపెనర్ వేడ్
  • అర్ధసెంచరీ నమోదు చేసిన మ్యాక్స్ వెల్
  • వాషింగ్టన్ సుందర్ కు రెండు వికెట్లు
సిడ్నీ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ ఆరంభం నుంచి ఎదురుదాడి చేస్తూ పరుగుల వర్షం కురిపించాడు. వేడ్ 53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 80 పరుగులు సాధించాడు. గాయం నుంచి కోలుకుని బరిలో దిగిన కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్ అయ్యాడు.

మాజీ సారథి స్టీవ్ స్మిత్ 24 పరుగులు చేయగా, గ్లెన్ మ్యాక్స్ వెల్ తనకు లభించిన లైఫ్ లను సద్వినియోగం చేసుకుని అర్ధసెంచరీ సాధించాడు. మ్యాక్స్ వెల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేశాడు. చివరికి వెరైటీగా షాట్ కొట్టబోయి నటరాజన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2, నటరాజన్ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.


More Telugu News