సిక్కు యువకుడిగా సల్మాన్ ఖాన్.. కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల.. వీడియో ఇదిగో
- సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ‘అంతిమ్’
- సల్మాన్ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్న దృశ్యం విడుదల
- సిక్కు పోలీసుగా కనపడనున్న సల్మాన్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ‘అంతిమ్’లోని ఫస్ట్‌లుక్ వీడియో విడుదలైంది. సిక్కు యువకుడిగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. షూటింగ్ సందర్భంగా స్టైల్‌గా నడుచుకుంటూ వస్తుండగా తీసిన ఈ వీడియో అభిమానులను అలరిస్తోంది.
ఈ వీడియోను సల్మాన్ ఖాన్ బావ ఆయుశ్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'అంతిమ్' షురూ అయిందని, అంతిమ్ ఫస్ట్‌లుక్ ఇదేనని ఆయన చెప్పాడు. ఈ సినిమాలో ఆయుష్ శర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో సల్మాన్ సిక్కు పోలీసుగా కనపడనున్నాడు.
ఈ సినిమాను దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ రూపొందిస్తున్నాడు. మరోవైపు, సల్మాన్ ఖాన్ ‘రాధే’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా విడుదల కాలేదు. ఇప్పుడు 'భాయ్‌జాన్' షూటింగులో సల్మాన్ బిజీ అయిపోయాడు.