తేజ చిత్రంలో కథానాయికగా కృతిశెట్టి?
- గోపీచంద్ తో 'అలిమేలుమంగ వేంకటరమణ'
- పలువురి పేర్లు పరిశీలించిన దర్శకుడు తేజ
- తాజాగా 'ఉప్పెన' ఫేమ్ కృతి పేరు తెరపైకి
- 'శ్యామ్ సింగరాయ్'లో నటిస్తున్న కృతి
ఒకప్పుడు చిన్న బడ్జెట్టులో సినిమాలు చేస్తూ, వరుసగా విజయాలు సాధించిన దర్శకుడు తేజ ఇటీవల విజయాల విషయంలో వెనుకపడ్డారు. గతకొంత కాలంగా ఆయనకు విజయం అన్నదే లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో చిత్రాన్ని చేయడానికి ఆయన ఉపక్రమిస్తున్నారు. యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపీచంద్ హీరోగా 'అలిమేలుమంగ- వేంకట రమణ' పేరుతో ఆ చిత్రాన్ని చేస్తున్నారు.
ఇందులో అలిమేలుమంగ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉండడంతో చక్కని అభినయాన్ని చూపగల హీరోయిన్ ను ఆ పాత్రకు ఎంపిక చేయాలని తేజ భావిస్తున్నారు. ఈ క్రమంలో పలు పేర్లు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. కాజల్, సాయిపల్లవి వంటి కథానాయికలను సంప్రదించినట్టు వార్తలొచ్చాయి.
అయితే, తాజాగా కృతిశెట్టి పేరు వినిపిస్తోంది. 'ఉప్పెన' చిత్రం ద్వారా టాలీవుడ్ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాని సరసన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం కృతిశెట్టితో సంప్రదింపులు జరుగుతున్నాయనీ, ఆమె ఎంపిక దాదాపు ఓకే అయినట్టేనని తెలుస్తోంది.