వ్యాక్సిన్ తయారీలో ఫైజర్ కు అనుకోని అవాంతరాలు!
- ఇప్పటికే ఫైజర్ టీకాను ఆమోదించిన పలు దేశాలు
- మరింత తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడంతో పాడైపోయిన టీకా
- కాలిఫోర్నియాకు పంపిన టీకాలు రీప్లేస్
- విచారిస్తున్నామన్న యూఎస్ అధికారులు
ఫైజర్ తయారు చేసిన కరోనా టీకాను పలు దేశాలు ఇప్పటికే ఆమోదించి, ప్రజలకు ఇవ్వడాన్ని ప్రారంభించగా, భారీ ఎత్తున వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన సంస్థకు ఇప్పుడు అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. కొన్ని వ్యాక్సిన్ లను ఉంచాల్సిన ఉష్ణోగ్రతకన్నా మరింత తక్కువ ఉష్ణోగ్రతల్లో ఉంచడం వల్ల సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. ఇక, వ్యాక్సిన్ ఉత్పత్తి కూడా అనుకున్నంత వేగంగా జరగడం లేదని అమెరికా అధికారులు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
కాలిఫోర్నియాకు సరఫరా చేసిన రెండు ట్రేల కరోనా వ్యాక్సిన్ డోస్ లు పనికిరాకుండా పోయాయని, వీటిని నిల్వ ఉంచిన ఉష్ణోగ్రత మైనస్ 80 డిగ్రీల సెల్సీయస్ కన్నా తక్కువకు పడిపోవడమే ఇందుకు కారణమని యూఎస్ ఆర్మీ జనరల్ గుస్టెవా పెర్నా వ్యాఖ్యానించారు. ఈ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీల వద్దే నిల్వ చేయాల్సి వుందని, కానీ, అంతకన్నా తక్కువకు తగ్గడంతో టీకాను రీప్లేస్ చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇదే సమయంలో నిల్వ చేసిన ఉష్ణోగ్రత మరింతగా తగ్గితే ఏర్పడే పరిణామాలపై అధికారులు విచారిస్తున్నారని ఆయన తెలిపారు.
ఇక ఫైజర్ సంస్థ ప్రొడక్షన్ లైన్స్ లో సైతం సమస్యలు తలెత్తాయని యూఎస్ సెక్రెటరీ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమర్ సర్వీసెస్ అలెక్స్ అజార్ తెలియజేశారు. ఇదే సమయంలో అమెరికన్లు అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఫైజర్ కు అవసరమైన సహాయ సహకారాలను అందించి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు.
మరోపక్క, ఈ వార్తలు టీకాపై ఆశలు పెంచుకుంటున్న వారిలో ఆందోళన రేపింది. ఎక్కడ వ్యాక్సిన్ మరింత ఆలస్యం అవుతుందోనన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఈ వార్తలపై ఫైజర్ సంస్థ ఇంకా స్పందించలేదు. తయారీలో ఎటువంటి సవాళ్లు ఎదురవుతున్నాయన్న ప్రశ్నకు సంస్థ ప్రతినిధులు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. కాగా, తొలి దశలో తాము 10 కోట్ల డోస్ లను అందిస్తామని ఫైజర్ భాగస్వామి బయో ఎన్ టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగర్ సాహిన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.