తొలి బిడ్డ జన్మిస్తున్న క్షణాల్లో అనుష్క పక్కనే ఉంటా... ఈ విషయంలో నాకు స్పష్టత ఉంది: విరాట్ కోహ్లీ
- త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న అనుష్క శర్మ
- ప్రస్తుతం ఆసీస్ తో తొలి టెస్టు ఆడుతున్న కోహ్లీ
- తొలి టెస్టు తర్వాత కోహ్లీ భారత్ తిరిగిరాక
- స్టీవ్ స్మిత్ తో చిట్ చాట్ సందర్భంగా మనోభావాలు వెల్లడి
- మధురక్షణాలను కోల్పోలేనని వివరణ
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్ తిరిగిరానున్నాడు. తన భార్య అనుష్క శర్మ ప్రసవ సమయం దగ్గరపడుతుండడంతో కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు కోహ్లీకి బీసీసీఐ ప్రత్యేకంగా పితృత్వపు సెలవు మంజూరు చేసింది. తాజాగా, కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తో చిట్ చాట్ సందర్భంగా ఈ అంశంపై స్పందించాడు.
తమ తొలి బిడ్డ జన్మిస్తున్న క్షణాల్లో భార్య అనుష్క పక్కనే ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఈ విషయంలో స్పష్టతతో ఉన్నానని వివరించాడు. ఏ విధంగా చూసినా ఆ మధుర క్షణాలను కోల్పోలేమని కోహ్లీ పేర్కొన్నాడు.
క్రికెట్ లో ఆటపైనే మనసు లగ్నం చేసి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుందని, అప్పట్లో తండ్రి చనిపోయినప్పుడు కెరీర్ కోసం ఆటలో కొనసాగాల్సిందేనని నిశ్చయించుకున్నానని వెల్లడించాడు. అప్పట్లో ఆట, కెరీర్ గురించి ఎంతో తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చిందని, కెరీర్ కోసం ఇతర విషయాలు పట్టించుకోకూడదని ఎంతో కఠిన నిర్ణయం తీసుకుని, పాటించానని కోహ్లీ తెలిపాడు. అయితే, మొదటి బిడ్డ అనేది ఎవరి జీవితంలోనైనా ప్రత్యేకమని, ఆ బిడ్డ పుట్టేటప్పుడు భార్య పక్కనే ఉండాలనుకోవడం సహజమని తెలిపాడు.