అనుకోని అవాంతరం... ఎందుకో చెప్పిన గూగుల్
- సోమవారం గూగుల్ సేవల్లో భారీ అంతరాయం
- నిలిచిన గూగుల్, యూట్యూబ్, జీమెయిల్
- తాజాగా ప్రకటన చేసిన గూగుల్
- లాగిన్ యూజర్ డేటా తరలింపులో తప్పిదమని వెల్లడి
- డేటాను తప్పుగా రిపోర్ట్ చేయడంతో సాంకేతిక సమస్య
ప్రముఖ సెర్చింజన్ గూగుల్ సేవల్లో అంతరాయం అంటే అది ఎంతో అరుదైన విషయం. అయితే ఈ సోమవారం నాడు ఏకంగా 47 నిమిషాల సేపు గూగుల్, యూట్యూబ్, జీమెయిల్ సేవలు నిలిచిపోయాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అనేక సంస్థల్లోని ఉద్యోగులు, ఇతర యూజర్లు ఏంజరుగుతోందో అర్థంకాక గందరగోళానికి లోనయ్యారు. ఈ సమస్యను గూగుల్ ఎలాగోలా పరిష్కరించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే గూగుల్ సేవల్లో అంతరాయానికి కారణమేంటన్నది ఇప్పుడు వెల్లడైంది.
దీనిపై గూగుల్ నేడు ఒక ప్రకటన చేసింది. లాగిన్ యూజర్ డేటా తరలింపు ప్రక్రియలో ఏర్పడిన సాంకేతిక సమస్య తమ సేవలు నిలిచిపోవడానికి దారితీసిందని గూగుల్ వివరించింది. తమ వివిధ సేవలకు సంబంధించిన లాగిన్ యూజర్ డేటాను గూగుల్ గత కొన్నినెలలుగా కొత్త ఫైళ్లకు బదలాయిస్తోంది. అయితే డేటాను తప్పుగా రిపోర్టు చేయడంతో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ కారణంగానే అంతరాయం ఏర్పడిందని గూగుల్ వివరించింది.