విజయ్ దేవరకొండ నా వాడు, నా స్నేహితుడు: బిగ్ బాస్ విజేత అభిజిత్

  • ఇటీవల ముగిసిన బిగ్ బాస్-4
  • విజేతగా నిలిచిన అభిజిత్
  • ఓ మీడియా చానల్ కు ఇంటర్వ్యూ
  • విజయ్ ఎంతో ప్రతిభావంతుడని వ్యాఖ్యలు
  • తరచుగా మాట్లాడుతుంటానని వెల్లడి
అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేత అభిజిత్ ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. విజయ్ దేవరకొండ నా వాడు, నా స్నేహితుడు అంటూ వ్యాఖ్యానించాడు. విజయ్, తాను తరచుగా మాట్లాడుకుంటామని పేర్కొన్నాడు. విజయ్ ఎంతో ప్రతిభావంతుడని, ప్రతి సినిమాలోనూ అమోఘమైన నటన కనబర్చుడతాడని ప్రశంసించాడు.

తామిద్దరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించామని గుర్తుచేసుకున్నాడు. ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులేనని, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ వారి సొంత గ్రాఫ్ ఉంటుందని అభిజిత్ అభిప్రాయపడ్డాడు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో అభిజిత్ హీరో రోల్ పోషించగా, విజయ్ దేవరకొండ నెగెటివ్ ఛాయలుండే చిన్న పాత్ర పోషించాడు. ఇద్దరి మధ్య అప్పటినుంచే స్నేహం బలపడింది. అభిజిత్ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు విజయ్ సోషల్ మీడియాలో స్పందించాడు. అభిజిత్ కు మద్దతుగా ట్వీట్ చేశాడు.


More Telugu News