పులివెందుల చర్చిలో తల్లి, భార్యతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌

  • క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు
  • ఈ రోజు వైకుంఠ ఏకాదశి కూడా కలిసి వచ్చింది
  • 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నాం
  • పులివెందులలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నాం
క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి విజయమ్మ, భార్య  భారతితో కలిసి ఈ రోజు ఆయన పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మాట్లాడారు. క్రిస్మస్‌తో పాటు ఈ రోజు వైకుంఠ ఏకాదశి కలిసి వచ్చిందని, ఈ పర్వదినాన 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

అయితే, పులివెందులలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నామని, ఎందుకంటే,  ఏపీఐఐసీ భూముల్లో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వద్దని నిన్న కొందరు న్యాయస్థానానికి వెళ్లి స్టే తెచ్చారని తెలిపారు. ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమలు వస్తే అక్కడ పనిచేసే ప్రజలకు ఇళ్లు ఉండాలని, అందుకే, అక్కడ పేదలకు ఇళ్లు ఇస్తున్నామని చెప్పారు.

హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ తాము సుప్రీంకోర్టుకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో మంచి పనులు చేస్తోంటే కొందరు మాత్రం అడ్డుతగులుతున్నారని ఆయన విమర్శించారు.



More Telugu News