ప్రభాస్ సీతగా ఇక ఆ బాలీవుడ్ భామేనా?

  • ప్రభాస్ నటించే మూడు సినిమాలు 
  • ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'
  • విలన్ లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్
  • సీత పాత్రకు కృతి సనాన్?      
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్న మూడు సినిమాలు ఇప్పుడు వార్తలలో ఎక్కువగా నిలుస్తున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సినిమా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమాలలో ప్రభాస్ నటించనున్నాడు. వీటిలో మళ్లీ 'ఆదిపురుష్' మరిన్ని ప్రత్యేకతలతో మరింతగా వార్తలలో వుంది.

పురాణగాథ రామాయణం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి తరహా పాత్ర పోషిస్తుండగా.. లంకేశ్ పాత్రకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ను ఎంచుకున్నారు. ఇక సీత పాత్ర విషయమే తేలాల్సి వుంది. ఇప్పటికే ఈ పాత్రలో పలానా నటి నటించనుందంటూ పలు పేర్లు ప్రచారంలోకి రావడం.. చిత్రబృందం వాటిని ఖండించడం జరిగింది.

అయితే, బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు, కృతి సనాన్ తో చిత్ర దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారని, కథానాయిక పాత్రకు దాదాపు ఆమె ఎంపికైనట్టేనని తెలుస్తోంది. ఒక మంచి ముహూర్తం చూసుకుని ఆమె పేరును అనౌన్స్ చేస్తారని అంటున్నారు. త్రీడీ ఫార్మేట్ లో నిర్మించనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తారు. ఇందులో వీఎఫ్ఎక్స్ కు కూడా చాలా ప్రాధాన్యత ఉందట. 


More Telugu News