హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలుదేరనున్న రజనీ కాంత్?
- అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న రజనీ
- ఆరోగ్యం నిలకడగా ఉందంటోన్న వైద్యులు
- రజనీకి మరిన్ని పరీక్షలు
- రిపోర్టులు బాగుంటే ఈ రోజు డిశ్చార్జ్
సినీనటుడు రజనీకాంత్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, బీపీ హెచ్చుతగ్గులకు చికిత్స చేస్తున్నామని ఇప్పటికే వైద్యులు ప్రకటించారు. నిన్న రజనీకి మరిన్ని పరీక్షలు చేశారు.
వాటిల్లో ఫలితాలు చాలావరకు సానుకూలంగానే ఉండడంతో ఆయనను త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. కొన్ని రిపోర్టులు వైద్యులకు అందాల్సి ఉంది. కాసేపట్లో ప్రత్యేక వైద్య బృందం జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి చేరుకోనుంది. రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని పరీక్షల రిపోర్టులను పరిశీలించనుంది.
డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన హైదరాబాద్ బేగంపేట నుండి చార్టర్డ్ ఫ్లైట్‌లో చెన్నైకు వెళ్లనున్నట్టు సమాచారం. ఇటీవలే ఆర్ఎంఎం (రజనీ మక్కల్ మండ్రం) సభ్యులతో చర్చించిన రజనీకాంత్ కొత్త పార్టీ పెడతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31న ఆయన పార్టీ పేరును ప్రకటించనున్నారు.