సమంతపై తీవ్ర విమర్శలు గుప్పించిన శ్రీరెడ్డి

  • సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను షేర్ చేసిన సమంత
  • ఇలాంటి డ్రస్సులు అక్కినేని అభిమానులకు నచ్చడం లేదన్న శ్రీరెడ్డి
  • నమ్రతను చూసి నేర్చుకోవాలని హితవు పలికిన వైనం
అక్కినేని వారి కోడలు, అగ్ర సినీ నటి సమంతపై మరో నటి శ్రీరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన హాట్ ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోలను ఇటీవల సమంత సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందిస్తూ... సమంత డీసెంట్ గా కనిపించాలని హితవు పలికారు. అక్కినేని కుటుంబంలో అమలగారి వస్త్రధారణ ఎంతో హుందాతనంతో కూడి ఉంటుందని అన్నారు. కానీ, సమంత డ్రెస్సింగ్ తనకు ఏమాత్రం నచ్చడం లేదని చెప్పారు.  

మహేశ్ బాబు భార్య నమ్రతను చూసి సమంత నేర్చుకోవాలని శ్రీరెడ్డి హితవు పలికారు. హీరోగా మహేశ్ సక్సెస్ వెనుక నమ్రత ఉన్నారని చెప్పారు. నీ భర్త నాగచైతన్య హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడని... ఆయన కెరీర్ ని నీవు చూసుకోవచ్చు కదా? అని అన్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా సరైన డ్రస్సులు వేసుకోవడం లేదని... అక్కినేని అభిమానులకు అది నచ్చడం లేదని వ్యాఖ్యానించారు. ఇకనైనా నాగచైతన్య జీవితం మీద, ఆయన కెరీర్ మీద దృష్టి సారించాలని సూచించారు.


More Telugu News