ఆసీస్ టూర్ లో మాటల యుద్ధం మొదలైంది... స్టంప్ మైక్ లో రికార్డయిన పంత్, వేడ్ మాటలు!

  • రెండో టెస్టులో స్లెడ్జింగ్
  • బుమ్రా బంతిని లెగ్ సైడ్ ఆడిన వేడ్
  • హెహ్హెహ్హె అంటూ పంత్ స్పందన
  • హెహ్హెహ్హె అంటూ బదులిచ్చిన వేడ్
  • నెట్టింట సందడి చేస్తున్న వీడియో
గతంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రతిసారి స్లెడ్జింగ్ తీవ్రస్థాయిలో సాగేది. దాదాపు ఆస్ట్రేలియా ఆటగాళ్లే టీమిండియా క్రికెటర్లను కవ్వించే ప్రయత్నాలు చేసేవారు. అయితే ఈసారి ఆసీస్ టూర్ లో వన్డే, టీ20 సిరీస్ ల్లో ఆసీస్ ఆటగాళ్లు కిమ్మనలేదు కానీ, టెస్టు సిరీస్ లో మాత్రం మాటల యుద్ధం షురూ చేశారు. మెల్బోర్న్ లో జరుగుతున్న రెండో టెస్టులో ఇవాళ్టి ఆట సందర్భంగా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఆసీస్ ఓపెనర్ మాథ్యూ వేడ్ మధ్య సాగిన కవ్వింపులు స్టంప్ మైక్రోఫోన్ లో రికార్డయ్యాయి.

బుమ్రా విసిరిన బంతిని వేడ్ లెగ్ సైడ్ ఆడగా, "హెహ్హెహ్హె" అంటూ పంత్ తనదైన శైలిలో స్పందించాడు. అయితే వేడ్ తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా, తాను కూడా "హెహ్హెహ్హె" అంటూ బదులిచ్చాడు. "హెహ్హెహ్హె... స్టేడియంలో ఉన్న బిగ్ స్క్రీన్ పై నీ ముఖం చూసుకున్నావా ఏంటీ?" అంటూ పంత్ ను రెచ్చగొట్టేందుకు యత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


More Telugu News