మెల్‌బోర్న్ టెస్ట్: 200 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. గెలుపు ముంగిట భారత్

  • భారత విజయ లక్ష్యం 70 పరుగులు
  • 67 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
  • హైదరాబాద్ పేసర్ సిరాజ్‌కు మూడు వికెట్లు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భరత్ విజయం ముంగిట నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 200 పరుగులకే కట్టడి చేసింది. దీంతో ఆ జట్టు ఆధిక్యం 69 పరుగులకే పరిమితమైంది. భారత విజయ లక్ష్యం 70 పరుగులే కావడంతో ఆట మరో రోజు మిగిలి ఉండగానే ముగియనుంది.

133/6తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 67 పరుగులు మాత్రమే చేసి చివరి నాలుగు వికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అశ్విన్, జడేజాలు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఉమేశ్ యాదవ్‌కు ఓ వికెట్ దక్కింది. అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్సింగ్స్‌లో 326 పరుగులు చేసింది. కోహ్లీ గైర్హాజరీలో జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన అజింక్య రహానే సెంచరీతో (112) జట్టును పటిష్ట స్థితిలోకి చేర్చాడు. శుభ్‌మన్ గిల్ 45, రవీంద్ర జడేజా 57 పరుగులతో ఆకట్టుకున్నారు.


More Telugu News