94.1 శాతం ప్రభావశీలతతో పనిచేస్తోన్న మోడెర్నా వ్యాక్సిన్
- అనారోగ్యాన్ని నివారించడంలో సమర్థత
- మూడో దశ క్లినికల్ ప్రయోగాల విశ్లేషణలో వెల్లడి
- దాదాపు 30 వేల మంది వాలంటీర్లపై ప్రయోగాలు
మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపి, దాన్ని పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ కరోనా మహమ్మారిపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు ప్రాథమిక విశ్లేషణలో తేలిందని ‘ది న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించారు.
వ్యాధి లక్షణాలతో కూడిన కరోనా ఇన్ఫెక్షన్లతో పాటు తీవ్రస్థాయి అనారోగ్యాన్ని నివారించడంలో ఆ వ్యాక్సిన్ 94.1 శాతం ప్రభావశీలతను చూపిందని పేర్కొంది. మోడెర్నా మూడో దశ క్లినికల్ ప్రయోగాలపై నిర్వహించిన ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయం తెలిసిందని పేర్కొంది.
దాదాపు 30 వేల మంది వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహించారని వెల్లడించింది. కొందరికి టీకాను, మరికొందరికి డమ్మీ టీకా (ప్లాసిబో)ను ఇచ్చి ఈ ప్రయోగాలు చేశారు. టీకా వేయించుకున్నవారిలో 11 మందికి మాత్రమే కరోనా సోకింది. డమ్మీ టీకా తీసుకున్న వారిలో 185 మందికి కరోనా సోకింది. కాగా, దీనిపై తమ ప్రయోగాలు కొనసాగుతాయని మోడెర్నాను అభివృద్ధి చేస్తోన్న ఓ శాస్త్రవేత్త తెలిపారు. కొన్ని నెలల్లో మరింత డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు.