'వైఎస్సార్ తాడిగడప' ఏంటి?: బుద్ధా వెంకన్న
- రాష్ట్రంలో మరిన్ని పట్టణ స్థానిక సంస్థలు
- మీడియాలో వచ్చిన కథనంపై స్పందించిన బుద్ధా
- జగన్ ది పైశాచికత్వం అంటూ వ్యాఖ్యలు
- ఊళ్ల పేర్లు కూడా ఉంచవా? అంటూ ఆగ్రహం
ఏపీలో మరిన్ని పట్టణ స్థానిక సంస్థలు ఏర్పాటు చేస్తున్నారంటూ మీడియాలో వచ్చిన ఓ కథనంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. విజయవాడలో కొత్తగా వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఆ కథనంలో పేర్కొనగా, బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.
"వైఎస్సార్ తాడిగడప ఏంటి? నీ పైశాచికత్వానికి ఊళ్ల పేర్లు కూడా ఉంచవా? బ్రదర్ అనిల్ విజయవాడ, సిస్టర్ షర్మిల గుంటూరు, విజయమ్మ ఆంధ్రప్రదేశ్ అని కూడా మార్చిపడేయ్!" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలాంటి పిచ్చోడి చేతిలో రాయి పెట్టినందుకు మాకు ఈ దరిద్రాలు తప్పవు అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.