ప్రజాస్వామ్యంలో ఇలాంటిది కూడదు.. అమెరికా కాల్పుల ఘటనపై మోదీ
- బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశం
- చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన ట్రంప్ మద్దతుదారులు
- హింసాత్మక ఘటన బాధ కలిగించిందన్న మోదీ
అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద ట్రంప్ మద్దతుదారుల నిరసన, ఆపై పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందడంపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ కాంగ్రెస్ క్యాపిటల్ భవనంలో సమావేశమయ్యారు. ట్రంప్ మద్దతుదారులు దీనిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బైడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు ఈ క్రమంలో కాల్పులు జరిపారు. బాష్పవాయువు ప్రయోగించారు. పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై మోదీ స్పందించారు. వాషింగ్టన్లో జరిగిన హింసాత్మక ఘటన బాధ కలిగించిందన్నారు. అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని, నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను ఆటంకపరచడం సరికాదంటూ ట్వీట్ చేశారు.