బ‌ర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. ఢిల్లీలో కిలో చికెన్ రూ.15కు ప‌డిపోయిన వైనం

  • చికెన్ తినొచ్చ‌ని వైద్యులు చెబుతున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో భ‌యం
  • హ‌ర్యానాలోని జింద్ జిల్లా నుంచి ఢిల్లీకి ప్ర‌తిరోజు ల‌క్ష‌ల‌ కోళ్ల త‌ర‌లింపు
  • ప్ర‌స్తుతం దీనిపై తీవ్ర ప్ర‌భావం
  • ప్రతిరోజూ సుమారు కోటీ 20 లక్షల రూపాయలు నష్టం
దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ విజృంభిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చికెన్ తినొచ్చ‌ని వైద్యులు చెబుతున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు వాటిని కొనేందుకు ఆస‌క్తి చూప‌ట్లేదు. బ‌ర్డ్ ఫ్లూ విజృంభ‌ణ కార‌ణంగా హ‌ర్యానాలోని జింద్ జిల్లా నుంచి ఢిల్లీకి కోళ్ల త‌ర‌లింపుపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింది. ఢిల్లీలో కిలో కోడి మాంసం ఖరీదు రూ.15కు పడిపోవ‌డం గ‌మ‌నార్హం.

జింద్ జిల్లా నుంచి రోజుకి సుమారు నాలుగు లక్షల కోళ్లను విక్రయానికి తరలిస్తుంటారు. వాటి ధ‌ర ఒక్క‌సారిగా ప‌డిపోవ‌డంతో కోళ్ల వ్యాపారులు ప్రతిరోజూ సుమారు కోటీ 20 లక్షల రూపాయలు నష్టపోతున్నారు. జింద్ జిల్లాలో పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌కు మంచి పేరుంది. ఆ జిల్లాలో 500కు పైగా పౌల్ట్రీ ఫారాలు, 80కి పైగా హ్యాచరీలు ఉంటాయి. అక్క‌డి నుంచి ఢిల్లీకి విక్రయించే కోళ్ల‌ బరువు సుమారు 8 లక్షల కిలోగ్రాములుంటుంది. కాగా, చికెన్ ను బాగా ఉడికించి తినడం వల్ల న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌ని వైద్యులు అంటున్నారు. ప‌లు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూతో వేలాది కాకులు, బాతులు మృతి చెందడంతో కోళ్ల బిజినెస్ కూడా దెబ్బ‌తింటోంది.


More Telugu News