విగ్రహాల ధ్వంసం ఘటనల నేపథ్యంలోనే ప్రభుత్వం ఆలయాల పునర్నిర్మాణం అంటోంది: పవన్ కల్యాణ్
- గత 18 నెలలుగా ఏంచేస్తున్నారన్న పవన్
- ఆలయాలపై దాడుల పట్ల స్పందన
- ప్రభుత్వ వైఖరిపై స్పష్టత లేదని వ్యాఖ్యలు
- సీసీ కెమెరాల ఏర్పాటుపై నిలదీత
ఆలయాల రక్షణపై ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఆలయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణలో ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఇప్పటికీ స్పష్టత లేదని విమర్శించారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది కూడా తెలియడంలేదని వ్యాఖ్యానించారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన తర్వాత అన్ని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారని, రాష్ట్రంలో 26 వేల ఆలయాలు ఉంటే, అందులో ఎన్నింటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు రామతీర్థం ఘటన తర్వాత కూడా అదే మాట చెబుతున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం కూల్చిన ఆలయాలను మళ్లీ కడుతున్నామని చెబుతున్న సర్కారు గత 18 నెలలుగా ఏంచేస్తోందని పవన్ ప్రశ్నించారు. విగ్రహాల ధ్వంసం ఘటనల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణం అంటోందని ఆరోపించారు.